కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు శ్రీ షిర్డీసాయిబాబా టెంపుల్ వద్ద బయట ఉన్న సాయి విగ్రహాన్ని మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిపై సాయి భక్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడుల పట్ల భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
బాబా విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాన్ని టీడీపీ, బీజేపీ నాయకులు పరిశీలించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మాజీ శాసనసభ్యుడు బోడే ప్రసాద్, బీజేపీ నాయకులు, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు ఆంజనేయులు ధ్వంసమైన సాయి బాబా విగ్రహాన్ని పరిశీలించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఆలయం ముందు ఆందోళన చేపట్టారు.
Also Read :
టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు సుదర్శన్ రావు కన్నుమూత