భార్యపై అనుమానంతో.. కరోనా మందని..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో.. భార్యపై అనుమానంతో ఓ ప్రబుద్ధుడు

భార్యపై అనుమానంతో.. కరోనా మందని..

Updated on: May 21, 2020 | 3:02 PM

Coronavirus Health Workers: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో.. భార్యపై అనుమానంతో ఓ ప్రబుద్ధుడు చేసిన నిర్వాకం అతడిని జైలుపాలు చేసింది. దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన విస్తుపోయే నిజాల్ని బయటపెట్టింది. ఇప్పటికే ఢిల్లీలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తన ప్రతీకారాన్ని తీర్చుకోడానికి ఆ వ్యక్తి.. కరోనా వైరస్‌ను అవకాశంగా మార్చుకున్నాడు.

వివరాల్లోకెళితే.. ఢిల్లీలోని అలీపూర్‌కు చెందిన ప్రదీప్‌(42).. తన భార్యకు ఓ హోమ్‌గార్డ్‌తో సంబంధముందని అనుమానించాడు. దీంతో ఆ హోమ్‌గార్డ్‌ కుటుంబాన్ని అంతమొందించాలని భావించి ఇద్దరు మహిళలను నియమించుకున్నాడు. ఆదివారం వారిని ఆరోగ్య కార్యకర్తల్లా అతని ఇంటికెళ్లమని చెప్పి, కరోనా వైరస్‌కు నివారణ మందు ఇస్తున్నట్లు నమ్మించాడు. విషం కలిపిన ఓ బాటిల్‌ను ఆ మహిళలు హోమ్‌గార్డ్‌ కుటుంబసభ్యులకు ఇవ్వడంతో.. ఆ ఇంట్లోని ముగ్గురూ అది తాగి అస్వస్థతకు గురయ్యారు.

కాగా.. తేరుకుని వెంటనే ఆస్పత్రికి వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు మహిళల్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రదీప్‌ తమకు డబ్బులు ఇచ్చి ఇలా చేయమని చెప్పాడని మహిళలు విచారణలో చెప్పడంతో అతడ్ని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us