పసుపు-కుంకుమపై జోక్యం చేసుకోలేం : ఢిల్లీ హైకోర్టు

| Edited By:

Apr 05, 2019 | 5:37 PM

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పెంచిన పింఛన్లు, పసుపు – కుంకుమ, అన్నదాతా సుఖీభవ పథకాల అమలుపై దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఎన్నికల సమయంలో ఈ పథకాలు లబ్ధిదారులకు అమలుకాకుండా చూడాలని కోరుతూ జనచైతన్య వేదిక కన్వీనర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరపు న్యాయవాది వినిపించిన వాదనను ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ, పెన్షన్లు పంపిణీ చేయొచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ […]

పసుపు-కుంకుమపై జోక్యం చేసుకోలేం : ఢిల్లీ హైకోర్టు
Follow us on

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పెంచిన పింఛన్లు, పసుపు – కుంకుమ, అన్నదాతా సుఖీభవ పథకాల అమలుపై దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఎన్నికల సమయంలో ఈ పథకాలు లబ్ధిదారులకు అమలుకాకుండా చూడాలని కోరుతూ జనచైతన్య వేదిక కన్వీనర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరపు న్యాయవాది వినిపించిన వాదనను ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ, పెన్షన్లు పంపిణీ చేయొచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టంచేసింది. ఇవన్నీ పాత పథకాలే కావడంతో నగదు పంపిణీ నిలిపివేయాల్సిన అవసరంలేదని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది.