కుటుంబ సమేతంగా అక్షరధామ్ ఆలయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పూజలు, ఇదే దీపావళి ‘సంరంభం’!

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం కుటుంబ సమేతంగా అక్షరధామ్ ఆలయంలో లక్ష్మీ పూజలు చేశారు. ఆయనతో బాటు డిప్యూటీ సీఎం మనీష్ శిశోడియా, ఇతర మంత్రులు..

కుటుంబ సమేతంగా అక్షరధామ్ ఆలయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పూజలు, ఇదే దీపావళి సంరంభం!

Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 14, 2020 | 9:36 PM

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం కుటుంబ సమేతంగా అక్షరధామ్ ఆలయంలో లక్ష్మీ పూజలు చేశారు. ఆయనతో బాటు డిప్యూటీ సీఎం మనీష్ శిశోడియా, ఇతర మంత్రులు కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు. దీపావళి నాడు బాణాసంచా కాల్చరాదని, అలాగే షాప్ కీపర్లు వాటిని అమ్మరాదని ప్రభుత్వం నిషేధం విధించింది. ఇందుకు బదులు ప్రజలు ఆలయాల్లో పూజలు చేయాలని  కేజ్రీవాల్ కోరారు. ఈ రాత్రి ఈయన అక్షరధామ్ ఆలయంలో చేసిన పూజా కార్యక్రమాన్ని టీవీల్లో లైవ్ గా ప్రసారం చేయడం విశేషం. వాతావరణ కాలుష్యాన్ని, కోవిడ్ ని అదుపు చేసేందుకు ఈ నెల 30 వరకు బాణాసంచా కాల్చడం, అమ్మడంపై సర్కార్ పూర్తి నిషేధం విధించింది. ఇటీవల నగరంలో మళ్ళీ కరోనా వైరస్ కేసులు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.