తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల..

తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ డిగ్రీ ఆడ్మిషన్ల ప్రక్రియను ఆగష్టు 31కు పూర్తి చేసి సెప్టెంబర్ 1 నుంచి క్లాసులు...

తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

Updated on: Jun 22, 2020 | 2:50 PM

తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవలే ఇంటర్మీడియట్ ఫలితాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక 2020-21 విద్యా సంవత్సరాన్ని సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో ఈ డిగ్రీ ఆడ్మిషన్ల ప్రక్రియను ఆగష్టు 31కు పూర్తి చేసి సెప్టెంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి పేర్కొన్నారు. దోస్త్ గురించి పూర్తి సమాచారం కొరకు https://dost.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదల…

  • జులై 1 నుంచి 14 వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
  • జులై 6 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
  • జులై 22న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
  • జులై 23 నుంచి 27 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం
  • జులై 23 నుంచి 29 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
  • జులై 23 నుంచి 30 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
  • ఆగస్టు 7న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
  • ఆగస్టు 8 నుంచి 13 వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
  • ఆగస్టు 8 నుంచి 14 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
  • ఆగస్టు 13న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
  • సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం