సుఖోయ్ విమానాల కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం

భారత్‌-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మరిన్ని కొత్తగా యుద్ధ విమానాల కొనుగోలుతో పాటు ప్రస్తుత విమానాల అధునీకరణకు అనుమితిస్తూ డిఫెన్స్‌ ఎక్విజిషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన డీఏసీ సమావేశంలో రూ.38,900 కోట్ల విలువైన ఆయుధ సామాగ్రి, రక్షణ పరికరాల కొనుగోలుకు ఆమోదం లభించింది.

సుఖోయ్ విమానాల కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం

Updated on: Jul 02, 2020 | 5:31 PM

భారత్‌-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మరిన్ని కొత్తగా యుద్ధ విమానాల కొనుగోలుతో పాటు ప్రస్తుత విమానాల అధునీకరణకు అనుమితిస్తూ డిఫెన్స్‌ ఎక్విజిషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన డీఏసీ సమావేశంలో రూ.38,900 కోట్ల విలువైన ఆయుధ సామాగ్రి, రక్షణ పరికరాల కొనుగోలుకు ఆమోదం లభించింది. వీటిలో రూ.31,130 కోట్ల విలువైన సామాగ్రిని భారత పరిశ్రమల నుంచి సమీకరిస్తారు. అలాగే, 21 మిగ్‌-29 యుద్ధ విమానాలతో పాటు 59 ఎంఐజీ-29 విమానాల ఆధునీకరణకు డీఏసీ ఆమోదం తెలిపింది. వీటితో పాటు 12 ఎస్‌యూ-30 ఎంకేఐల కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

ఇప్పటికే రష్యా నుంచి అత్యాధునిక ఎంఐజీ-29 యుద్ధవిమానాల కొనుగోలుతో పాటు ప్రస్తుత యుద్ధ విమానాల ఆధునీకరణకు రూ.7400 కోట్ల రూపాయలు వెచ్చించనుండగా, రూ.10,700 కోట్ల రూపాయలతో 12 సుఖోయ్‌ యుద్ధవిమానాలను కొనుగోలు చేయాలని రక్షణ శాఖ నిర్ణయించింది. గత కొంతకాలంగా యుద్ధ విమానాల కొనుగోలు, ఆధునీకరణ చేపట్టాలని భారత వాయుసేన కోరుతోంది. దీంతో రక్షణ రంగంలో అత్యాధునిక యుద్ధ విమానాలకు ఆమోదం తెలపడంతో మార్గం సుగమం అయ్యింది.