వేంకటేశ్వర వేద విద్యాలయానికి జాతీయ హోదా కల్పించాలి.. కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేసిన తితిదే ఛైర్మన్..

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని జాతీయ వేద విశ్వవిద్యాలయంగా ప్రకటించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి డా. రమేష్ పోఖ్రియాల్‌ను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు

వేంకటేశ్వర వేద విద్యాలయానికి జాతీయ హోదా కల్పించాలి.. కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేసిన తితిదే ఛైర్మన్..
Follow us

| Edited By:

Updated on: Dec 09, 2020 | 9:33 PM

declare sri venkateswara vedic university as central university… ttd chairman  తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలం రెండు రాష్ట్రాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. బ్రాహ్మణ కుబుంబాల పిల్లలకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. వేద విద్యకు సంబంధించి ఇందులో సీటు లభిస్తే చాలు వారి జీవితం పూర్తిగా మారిపోయినట్లే.

అయితే ఈ యూనివర్సిటీని జాతీయ వేద విశ్వవిద్యాలయంగా ప్రకటించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి డా. రమేష్ పోఖ్రియాల్‌ను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్న అందజేశారు. ఈ సందర్భంగా తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వేద విద్య వ్యాప్తి, పరిరక్షణ కోసం శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని 2006లో తితిదే ప్రారంభించిందని అన్నారు.

2007లో రాష్ట్ర విశ్వవిద్యాలయంగా యూజీసీ గుర్తించిందన్నారు. వేదాలకు సంబంధించి డిగ్రీ నుంచి పీహెచ్‌డీ వరకు వివిధ కోర్సులు నడుపుతున్నట్లు వివరించారు. అంతేకాకుండా వేద విద్యను ప్రోత్సహించేందుకు సొంతంగా వేద పాఠశాలలు నడపడమే కాకుండా దేశవ్యాప్తంగా 80 వేద గురుకులాలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు.