శవం నీళ్లు తాగిందట..ఆస్ప‌త్రికి తీసుకెళ్తే ఏం చెప్పారంటే…

|

Jul 26, 2020 | 7:13 PM

చ‌నిపోయార‌ని భావించిన వ్య‌క్తులు చితికి తీసుకెళ్లాక లేచి కూర్చున్న‌ ఘ‌ట‌న‌లు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. చావును పూర్తిగా నిర్దారించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఇటువంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతూ ఉంటాయి.

శవం నీళ్లు తాగిందట..ఆస్ప‌త్రికి తీసుకెళ్తే ఏం చెప్పారంటే...
Follow us on

చ‌నిపోయార‌ని భావించిన వ్య‌క్తులు చితికి తీసుకెళ్లాక లేచి కూర్చున్న‌ ఘ‌ట‌న‌లు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. చావును పూర్తిగా నిర్దారించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఇటువంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతూ ఉంటాయి. కానీ చ‌చ్చిపోయిన మ‌నిషి మ‌ళ్లీ బ్ర‌త‌క‌డం మాత్రం అసాధ్యం. తాజాగా చ‌నిపోయిన వ్య‌క్తికి అంత్య‌క్రియ‌లు చేసే స‌మ‌యంలో శవం నీళ్లు తాగిందంటూ ఖ‌ననాన్ని ఆపివేశారు బంధువ‌లు. డెడ్ బాడీని వెంట‌నే ఆస్ప‌త్రికి తీసుకెళ్లి ప‌రీక్ష‌లు కూడా చేయించారు. బంధుమిత్రులు భ్ర‌మ ప‌డ‌టంతోనే ఈ గంద‌ర‌గోళం చోటుచేసుకుంది. క‌ర్ణాట‌క‌లోని ధార్వాడ్ లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

ఇటీవల హార్ట్ అటాక్ రావ‌డంతో ఓ వ్య‌క్తి మరణించాడు. అతనికి అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ స‌భ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ క్ర‌మంలో నోట్లో నీళ్లు పోస్తే శవం తాగిందని ఓ వ్యక్తి చెప్పాడు. దీంతో అతడు బతికి ఉన్నాడేమోనని నమ్మి కేఐఎమ్ఎస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు టెస్టులు చేసి స‌ద‌రు వ్య‌క్తి చనిపోయాడని నిర్ధారించారు. భ్రమ పడటం వల్ల ఇలా జ‌రిగి ఉండొచ్చ‌ని డాక్ట‌ర్లు అభిప్రాయ‌డ్డారు. దీంతో తిరిగి శ‌వాన్ని ఇంటికి తెచ్చి అంత్యక్రియలు ముగించారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

 

ఇది కూడా చ‌ద‌వండి : కుమార్తెల‌తో కాడి మోయిస్తూ రైతు వ్య‌వ‌సాయం..చ‌లించిపోయిన సోనూసూద్..