తల్లి ఓదార్చిన ఆ బిడ్డ.. అంతలోనే ఘోరం జరిగింది..

|

Aug 20, 2020 | 1:22 PM

తీవ్ర మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది.ఇంతలో అమ్మా చనిపోతే సమస్యలకు పరిష్కారం కాదని చెప్పింది కన్న కూతురు. తల్లి ఓదార్చిన ఆ బిడ్డ తానే బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

తల్లి ఓదార్చిన ఆ బిడ్డ.. అంతలోనే ఘోరం జరిగింది..
Follow us on

తీవ్ర మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది.ఇంతలో అమ్మా చనిపోతే సమస్యలకు పరిష్కారం కాదని చెప్పింది కన్న కూతురు. తల్లి ఓదార్చిన ఆ బిడ్డ తానే బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, నమ్మిన వ్యక్తితో గొడవలు మరోవైపు, బతుకు భారంగా మారడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవాలని ఇంట్లో ఉరి తాడు వేలాడదీసింది. ఇది గమనించిన ఆమె కూతురు ‘నీవు లేకుండా ఎలా ఉండగలనమ్మా..’ అని బతిమాలి ఆ తల్లి ప్రాణాలను కాపాడింది. కానీ.. ఇంట్లో ఉరితాడు అలానే వేలాడుతూ ఉండిపోయింది. తెల్లారి అదే తాడుతో కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాలలో జరిగింది.

ఈమనికి చెందిన యార్లగడ్డ పావని 14 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉంటూ.. వేరే వ్యక్తితో సహజీవనం చేస్తూ తన కుమార్తె సౌజన్య(14)తో కలిసి దుగ్గిరాలలో నివాసం ఉంటున్నారు. సౌజన్య తొమ్మిదో తరగతి చదువుతుండగా, పావని తెనాలిలోని ఓ దుకాణంలో పని చేస్తోంది. మంగళవారం రాత్రి ఇంట్లో ఆర్థిక సమస్యలపై పావనికి, సహజీవనం చేస్తున్న వ్యక్తికి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన పావని ఇంట్లో చీరతో ఉరి వేసుకునే ఆత్మహత్యయత్నం చేసింది. ఇది గమనించిన కూతురు సౌజన్య తల్లిని బతిమాలి ఒప్పించింది. ఆ తర్వాత ఇద్దరూ ఏడుస్తూ నిద్రపోయారు.

ఇదిలావుండగా, బుధవారం తెల్లారి లేచి పావని దుకాణానికి వెళ్లి ఉదయం 11 గంటలకు తిరిగి ఇంటికి రాగా.. గత రాత్రి ఆమె బిగించిన ఉరి తాడుతోనే కుమార్తె సౌజన్య ఆత్మహత్య చేసుకుంది. కుమార్తెను ఆ స్థితిలో చూసిన తల్లి కన్నీరుమున్నీరైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తెనాలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.