Jani Master turns actor : స్టెప్పులతో ఇరగ్గొట్టిన జానీ మాస్టర్..యాక్టింగ్‌తో అదరగొడతాడా..?

జానీ మాస్టర్ స్టెప్పేస్తే...సీటీ కొట్టాల్సిందే అన్న టాక్ ఉంది ఇండస్ట్రీలో. అందుకే తెలుగు, తమిళ భాషల్లో...స్టార్ హీరోలకు..సీనియర్లకు ఆయన ఫేవరెట్.

Jani Master turns actor : స్టెప్పులతో ఇరగ్గొట్టిన జానీ మాస్టర్..యాక్టింగ్‌తో అదరగొడతాడా..?

Updated on: Dec 27, 2020 | 5:37 PM

జానీ మాస్టర్ స్టెప్పేస్తే…సీటీ కొట్టాల్సిందే అన్న టాక్ ఉంది ఇండస్ట్రీలో. అందుకే తెలుగు, తమిళ భాషల్లో…స్టార్ హీరోలకు..సీనియర్లకు ఆయన ఫేవరెట్. హీరో ఏ స్టెప్పేస్తే మాస్ జనం ఎంజాయ్ చేస్తారో..జానీ మాస్టర్‌కు తెలుసు. ఎందుకంటే ఆయన కూడా కిందనుంచి వచ్చారు కాబట్టి. ఇప్పటివరకు స్టెప్పులతో ఇరగదీసిన జానీ మాస్టర్…త్వరలో వెండితెరపై నటుడిగా కనిపించబోతున్నారు. మురళి అనే దర్శకుడు తీయబోతున్న చిత్రంతో జానీ మాస్టర్ తెరంగేట్రం చేయబోతున్నారు. వెంకట రమణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

డ్యాన్స్ మాస్టర్‌గా విజయవంతంగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న జానీ..ఇపుడు నటుడిగా ఎంతమేర రాణిస్తారో చూడాలి. ఈ క్రమంలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్న జానీ మాస్టర్‌కు ఆయన అభిమానులు ధన్యవాదాలు చెబుతున్నారు. గతంలో ప్రభుదేవా, లారెన్స్ లాంటి కొరియోగ్రాఫర్స్…నటులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. మరి జానీ కూడా ఆ బ్యాచ్‌లో చేరిపోతాడో..లేదో చూడాలి.

 

Also Read : 

Rajinikanth Health Update : ఆల్ క్లియర్.. ఆస్పత్రి నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్..ఆనందంలో అభిమానులు

 మెడిసిన్ ఇచ్చి ఆదుకున‌్న భారతం..మన వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల ఆరాటం