తమిళనాడు, కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన

| Edited By:

Apr 28, 2019 | 9:36 PM

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫొని తుఫాన్ క్రమంగా బలపడి వాయువ్య దిశగా కొనసాగుతుంది. మరో 12 గంటలలో బలపడి తీవ్రతుఫాన్‌గా మారనుండగా ఈనెల 30న తీరం తాకే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. దీనిప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. పుదుచ్చేరి, కేరళ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఏపీలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రకాశం, […]

తమిళనాడు, కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
Follow us on

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫొని తుఫాన్ క్రమంగా బలపడి వాయువ్య దిశగా కొనసాగుతుంది. మరో 12 గంటలలో బలపడి తీవ్రతుఫాన్‌గా మారనుండగా ఈనెల 30న తీరం తాకే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. దీనిప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. పుదుచ్చేరి, కేరళ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఏపీలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రకాశం, నెల్లూరు, తూగో, పగో జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.