ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు వర్షాలు.. అప్రమత్తమైన అధికారులు..

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే మన్నార్ గల్ఫ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయిగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది.

ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు వర్షాలు.. అప్రమత్తమైన అధికారులు..
Follow us

|

Updated on: Dec 07, 2020 | 9:47 AM

Cyclone Burevi: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే మన్నార్ గల్ఫ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయిగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధనంగా ట్రోపో ఆవరణ ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దాని ప్రభావం కారణంగా ఏపీ వ్యాప్తంగా నేడు, రేపు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. రేపు నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో నెల్లూరులో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు సైక్లోన్ బురేవి ప్రభావంతో తిరుమలలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. అక్కడ వర్షాలు కారణంగా వారం రోజులుగా చలి తీవ్రత ఎక్కువైంది.

Latest Articles