ఒక్క ‘లింక్’తో 2 లక్షలు ఖాళీ చేసిన సైబర్ కేటుగాళ్లు..

| Edited By:

May 22, 2020 | 3:23 PM

హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఉండే వరలక్ష్మి అనే సీనియర్ ఉపాధ్యాయురాలు రెండు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎయిర్‌టెల్ కస్టమర్ కేర్ నుండి ఉపాధ్యాయురాలికి

ఒక్క లింక్తో 2 లక్షలు ఖాళీ చేసిన సైబర్ కేటుగాళ్లు..
Follow us on

Cybercrime: హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఉండే వరలక్ష్మి అనే సీనియర్ ఉపాధ్యాయురాలు రెండు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎయిర్‌టెల్ కస్టమర్ కేర్ నుండి ఉపాధ్యాయురాలికి ఒక కాల్ వచ్చింది. మీ సిమ్ కార్డు బ్లాక్ అయిపోతుందని కాల్ చేసి చెప్పిన సైబర్ కేటుగాళ్లు.. 2020 నుండి 2026 వరకు మీ నెంబర్ ప్లాన్ ను పొడిగించేందుకు ఈ కాల్ చేస్తున్నాం.. దీనికి సంబంధించి మీ నెంబర్ కు ఒక లింకు పంపిస్తాం.. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పారు.

కాగా.. ఆ లింక్ డౌన్లోడ్ చేసుకొని వాళ్లు చెప్పిన విదంగా ఫాలో అయింది వరలక్ష్మి. ఆ లింకు ద్వారా ఆమె ఫోన్లో ఉన్న బ్యాంకు డీటెయిల్స్ ను, సెల్ ఫోన్ నెంబర్ ద్వారా బ్యాంకులో ఉన్న రెండు లక్షల నగదును ఖాళీ చేశారు కేటుగాళ్లు. ఆమెకి వచ్చిన కాల్ డిటైల్స్ పరిశీలించగా బీహార్ కు సంబంధించిన అడ్రెస్ వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసినా, లింక్ లు పంపినా జాగ్రతగా ఉండాలి అని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.