చెన్నై మెరిసింది… సజీవంగా ప్లేఆఫ్ ఆశలు
అద్భుతమై ఆటతీరుతో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. హైదరాబాద్‌పై గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. బ్యాటింగ్ వైఫల్యంతో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమిని మూటగట్టుకుంది.
Chennai Super Kings Win : అద్భుతమై ఆటతీరుతో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. హైదరాబాద్‌పై గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. బ్యాటింగ్ వైఫల్యంతో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమిని మూటగట్టుకుంది. చెన్నై బౌలర్ల దాడికి హైదరాబాద్ జట్టు చిగురుటాకులా వణికిపోయింది.
దుబాయ్ వేదికగా వార్నర్ సేనతో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై ఆరు వికెట్లకు 167 పరుగులు చేసింది. విలియమ్సన్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. లక్ష్య ఛేదనలో చెన్నై బౌలర్ల ధాటికి హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది.
దీంతో చెన్నై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. కేన్ విలియమ్సన్ (57: 39 బంతుల్లో 7ఫోర్లు) అద్భుత అర్ధశతకం పోరాటం వృథా అయింది.కేన్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో(2/25), కర్ణ్ శర్మ(2/37) సన్‌రైజర్స్‌ను దెబ్బతీశారు.
చేజింగ్‌లో సన్‌రైజర్స్‌కు శుభారంభం లభించలేదు. ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. శామ్ కరన్ వేసిన నాలుగో ఓవర్లో వార్నర్(9), మనీశ్ పాండే(4) వెనుదిరిగారు. 27 పరుగులకే సన్‌రైజర్స్ 2 వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడిలో పడింది.
ఈ దశలో క్రీజులో ఉన్న విలియమ్సన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. అయితే విలియమ్సన్, బెయిర్‌స్టో క్రీజ్‌లో కుదురుకునే ప్రయత్నం చేయగా ఈ జోడీని జడేజా విడదీశాడు. జడ్డూ వేసిన 10వ ఓవర్లో బెయిర్‌స్టో బౌల్డ్ అయ్యాడు.
మరో ఎండ్‌లో బ్యాట్స్‌మన్ సహకారం అందిచకపోయినా కేన్ ఒక్కడే ఆఖరి పోరాటం చేశాడు . 36 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కర్ణ్ శర్మ వేసిన తర్వాతి ఓవర్ మొదటి బంతికి ఫోర్ కొట్టిన విలియమ్సన్.. తర్వాతి బంతికే ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివరి ఓవర్లలో రషీద్ ఖాన్(14), షాబాజ్ నదీమ్(5) పోరాడిన గెలుపు అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగారు.