గ్రామీణ యువతకు శుభవార్త అందించింది ప్రభుత్వ రంగ ఈ-గవర్నెన్స్ సంస్థ. గ్రామాల్లో ఉండే యువతకు సైబర్ భద్రత, క్యాడ్, 3డీ ప్రింటింగ్ కోర్సులను అందజేయనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫ్రాన్స్‌కు చెందిన ఎకోల్ సుపీరియర్ రాబర్ట్ డి సార్బన్ సంస్థతో కలిసి ఈ కోర్సులను అందించనుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సీఎస్సీ అకాడమీ కేంద్రాల్లో ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకురానుంది. అటు గ్రామీణ యువత కోసం ప్రత్యేకంగా క్యాడ్, 3డీ ప్రింటింగ్ కోర్సులను ప్రారంభించనున్నట్లు సీఎస్సీ ఎండీ దినేశ్ త్యాగి తెలిపారు. నాన్ ప్రాఫీట్ పొందని ఎకోల్ సుపీరియర్ సంస్థతో భాగస్వామ్యం వలన ఉద్యోగావకాశాలతోపాటు, స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం 5 వేల సీఎస్సీ అకాడమీ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా.. అటు దేశవ్యాప్తంగా మరో 7000 కేంద్రాలను ప్రారంభించాలని అనుకుంటున్నట్లుగా త్యాగి తెలిపారు.