బెంగాల్‌లో నాటు బాంబులు, లాఠీ ఛార్జ్.. పేట్రేగిన ‘వయొలెన్స్’

| Edited By:

May 19, 2019 | 4:09 PM

చివరి దశ పోలింగ్ కొనసాగుతున్న సమయంలో పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ హింసకాండ చెలరేగింది. భాత్పరా నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీలు నాటుబాంబులు విసురుకోవడంతోనూ.. ఘర్షణకు పాల్పడిన కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్‌కి దిగడంతోనూ పరిస్థితి చేయిదాటింది. ముఖ్యంగా అధికార తృణమూల్, విపక్ష బీజేపీ కార్యకర్తలు ఒక దశలో చెలరేగిపోయారు. ఈ ఘటనపై ఈసీ అధికారుల నుంచి నివేదికను కోరింది. భాత్పరాలో మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత మదన్ మిత్రా.. బీజేపీ అభ్యర్థి పవన్ కుమార్ సింగ్‌పై పోటీ […]

బెంగాల్‌లో నాటు బాంబులు, లాఠీ ఛార్జ్.. పేట్రేగిన ‘వయొలెన్స్’
Follow us on

చివరి దశ పోలింగ్ కొనసాగుతున్న సమయంలో పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ హింసకాండ చెలరేగింది. భాత్పరా నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీలు నాటుబాంబులు విసురుకోవడంతోనూ.. ఘర్షణకు పాల్పడిన కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్‌కి దిగడంతోనూ పరిస్థితి చేయిదాటింది. ముఖ్యంగా అధికార తృణమూల్, విపక్ష బీజేపీ కార్యకర్తలు ఒక దశలో చెలరేగిపోయారు. ఈ ఘటనపై ఈసీ అధికారుల నుంచి నివేదికను కోరింది. భాత్పరాలో మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత మదన్ మిత్రా.. బీజేపీ అభ్యర్థి పవన్ కుమార్ సింగ్‌పై పోటీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పోలింగ్ ముగిసేవరకు కేంద్ర భద్రతా బలగాలను మోహరించాలని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ అధికారులను ఆదేశించారు. కాగా ఈ సారి జరిగిన ఏడు దశల ఎన్నికల్లో ప్రతి రౌండ్ పోలింగ్‌లో పశ్చిమ బెంగాల్‌లో హింసాకాండ కొనసాగింది.