స్టార్ సాకర్ ప్లేయర్ రొనాల్డో‌కు కరోనా పాజిటివ్..

|

Oct 14, 2020 | 3:05 PM

స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టినో రొనాల్డో‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధికారికంగా వెల్లడించింది.

స్టార్ సాకర్ ప్లేయర్ రొనాల్డో‌కు కరోనా పాజిటివ్..
Follow us on

స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టినో రొనాల్డో‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధికారికంగా వెల్లడించింది. నేషన్స్ లీగ్‌లో భాగంగా ఇవాళ స్వీడన్‌, పోర్చుగల్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ప్లేయర్స్ అందరికీ కరోనా టెస్టులు నిర్వహించారు. దీనిలో రొనాల్డోకు కరోనా పాజిటివ్‌గా తేలింది. (Cristiano Ronaldo Covid 19)

ప్రస్తుతం రొనాల్డో ఆరోగ్యంగానే ఉన్నాడని.. ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని.. రెండు వారాలపాటు హోం క్వారంటైన్‌లో ఉంటాడని పోర్చుగీస్ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ తెలిపింది. కాగా, నేషన్స్ లీగ్‌లో రొనాల్డో లేకపోవడం పోర్చుగల్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అని క్రీడా అభిమానులు అంటున్నారు.

Also Read: ఏంటిది.! అంపైర్‌ను ధోని భయపెట్టాడా.?