కంగనాను సపోర్ట్ చేసిన మనోజ్ తివారి

బాలీవుడ్‌ ముద్దుగుమ్మల మధ్య కొనసాగుతున్న మాటల మంటకు మరింత ఆజ్యం పోశాడు ప్రముఖ క్రికెటర్ మనోజ్ తివారి. బాలీవుడ్‌లోని బంధుప్రీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న.........

కంగనాను సపోర్ట్ చేసిన మనోజ్ తివారి

Updated on: Jul 23, 2020 | 5:26 AM

Cricketer Manoj Tiwary slams Kangana Ranaut’s critics : బాలీవుడ్‌ ముద్దుగుమ్మల మధ్య కొనసాగుతున్న మాటల మంటకు మరింత ఆజ్యం పోశాడు ప్రముఖ క్రికెటర్ మనోజ్ తివారి. బాలీవుడ్‌లోని బంధుప్రీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న హీరోయిన్ కంగనా రనౌత్‌కు అండగా నిలిచాడు. సుశాంత్ ఆత్మహత్యకు కారణమేంటో దేశం తెలుసుకోవాలనుకుంటోందని ట్వీట్ చేశాడు.

కంగనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై నిప్పులు చెరిగాడు. కంగన చేస్తున్న పోరాటం పక్కదారి పట్టకుండదని కోరకుంటున్నానని అన్నాడు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నందుకు కంగనపై కొందరు కావాలని దాడి చేస్తున్నారని విమార్శించాడు.

ఆమెకు మద్దతుగా నిలవలేకపోతే పోనీ… కనీసం మట్లాడకుండా ఊరుకోవచ్చు కదా అంటూ మండిపడ్డాడు. కంగనపై మాటల దాడి చేస్తున్నవారు తమ అసలు మనస్తత్వం ఏంటో బయటపెడుతున్నారని ఎద్దేవ చేశాడు. అయితే మన కర్మ ఫలితం ఎప్పటికైనా మనకే వచ్చి చేరుతుందని వేదాంత దోరణిలో హెచ్చరించాడు.