ఢిల్లీ, మహారాష్ట్రల్లో కొనసాగుతున్న కరోనా కల్లోలం

|

Jul 14, 2020 | 8:46 PM

దేశంలో కరోనా వ్యాప్తి కంటీన్యూ అవుతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా విస్తరిస్తూనే ఉంది. రోజు రోజుకీ పెరుగుతున్న కేసులతో జనం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అటు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా భారత్ లో పెరుగుతున్నట్లు కేంద్ర తెలిపింది.

ఢిల్లీ, మహారాష్ట్రల్లో కొనసాగుతున్న కరోనా కల్లోలం
Follow us on

దేశంలో కరోనా వ్యాప్తి కంటీన్యూ అవుతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా విస్తరిస్తూనే ఉంది. రోజు రోజుకీ పెరుగుతున్న కేసులతో జనం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అటు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా భారత్ లో పెరుగుతున్నట్లు కేంద్ర తెలిపింది.

మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6,741 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా 213 మంది మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,67,665కి చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 1,07,665 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకొని ఇప్పటివరకు 1,49,007 మంది డిశ్చార్జ్‌ అయినట్లు తెలిపారు.

ఇక, దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా వైర‌స్ క‌రాళ నృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసుల‌తో ఢిల్లీ వ‌ణికిపోతోంది. మంగళవారం సాయంత్రం నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 1,15,346కు చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,606 మందికి పాజిటివ్ నిర్ధార‌ణ కాగా, 35 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. మొత్తంగా మృతుల సంఖ్య 3,446కు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు కరోను నుంచి 93,236 మంది కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జి అయ్యినట్లు ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు,