Covid 19: మరో రెండు రాష్ట్రాల్లో కరోనా!

| Edited By:

Mar 09, 2020 | 9:52 PM

ప్రపంచాన్ని గడగడలాడిస్తూ భారత్ లోకి ప్రవేశించిన కరోనా వైరస్ తాజాగా పంజాబ్ రాష్ట్రానికి వ్యాపించింది. బాధిత వ్యక్తి ఇటీవల ఇటలీ పర్యటన నుంచి తిరిగొచ్చినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ‘బాధితుడు మార్చి 4న

Covid 19: మరో రెండు రాష్ట్రాల్లో కరోనా!
India Coronavirus,
Follow us on

Covid 19: ప్రపంచాన్ని గడగడలాడిస్తూ భారత్ లోకి ప్రవేశించిన కరోనా వైరస్ తాజాగా పంజాబ్ రాష్ట్రానికి వ్యాపించింది. బాధిత వ్యక్తి ఇటీవల ఇటలీ పర్యటన నుంచి తిరిగొచ్చినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ‘బాధితుడు మార్చి 4న ఇద్దరు కుటుంబ సభ్యులతో పాటూ ఇటలీ నుంచి అమృత్‌సర్‌కు తిరిగొచ్చారు. అతడిని పరీక్షించగా కరోనా సోకినట్టు వెల్లడైంది.’ అని పంజాబ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనురాగ్ అగర్వాల్ తెలిపారు.

కాగా.. బెంగుళూరుకు చెందిన ఓ టెకీ కరోనా బారిన పడ్డట్టు రాష్ట్ర మంత్రి కె. సుధాకర్ తెలిపారు. దీంతో కర్నాటకలో తొలి కరోనా కేసు నమోదైంది. బాధితుడు.. ఆస్టిన్(అమెరికా) నుంచి తన భార్యతో పాటూ మార్చి1న బెంగళూరుకు చేరుకున్నాడు. కొద్ది రోజుల తరువాత తనలో వ్యాధి లక్షణాలు కనిపించడంతో అతడు ఓ ప్రైవేటు ఆస్పత్రిని సంప్రదించాడు. ఆ తరువాత తనే స్వయంగా రాజీవ్ గాంధీ చెస్ట్ డిసీజ్ ఆసుపత్రి వైద్యులకు మార్చి 8న ఈ సమాచారాన్ని అందించాడు. దీంతో కరోనా వైరస్(కొవిడ్-19) మరో రెండు రాష్ట్రాలకు విస్తరించినట్టైంది.