గవర్నర్ కార్యాలయంలో కరోనా పాజిటివ్

|

Jul 08, 2020 | 1:46 PM

Covid-19 positive in Lt Governor Kiran Bedi office : కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని గవర్నర్ భవన్ లో కరోనా కలకలం రేపింది. గవర్నర్ బంగ్లాలో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో గవర్నర్ కిరణ్ బేడీతో సహా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అనంతరం గవర్నర్ బంగ్లాలోని సిబ్బందిని క్వారంటైన్ చేశారు. గవర్నర్ భవన్‌ని శానిటేషన్ చేస్తున్నారు అధికారులు. రెండురోజుల పాటు గవర్నర్ భవనాన్ని మూసివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. గవర్నర్ కిరణ్ […]

గవర్నర్ కార్యాలయంలో కరోనా పాజిటివ్
Follow us on

Covid-19 positive in Lt Governor Kiran Bedi office : కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని గవర్నర్ భవన్ లో కరోనా కలకలం రేపింది. గవర్నర్ బంగ్లాలో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో గవర్నర్ కిరణ్ బేడీతో సహా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అనంతరం గవర్నర్ బంగ్లాలోని సిబ్బందిని క్వారంటైన్ చేశారు. గవర్నర్ భవన్‌ని శానిటేషన్ చేస్తున్నారు అధికారులు. రెండురోజుల పాటు గవర్నర్ భవనాన్ని మూసివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. గవర్నర్ కిరణ్ బేడీ ఆరోగ్యంగానే ఉన్నారని అధికారులు ప్రకటించారు.

ఇక పుదుచ్చేరిలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 112 కేసులు నమోదయ్యాయి. వీటిలో 79 పుదుచ్చేరిలోవి కాగా.. 25 కేసులు యానం సముద్ర తీరంలో వచ్చినట్లుగా అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి కృష్ణారావు తెలిపారు. పుదుచ్చేరిలో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.  ఇప్పటి వరకు 20,480 మందికి కొవిడ్-19 పరీక్షలు చేసినట్లుగా ప్రకటించారు.