ఇండియా గ్రేట్..క‌ష్ట‌స‌మ‌యంలో ఆ దేశానికి భారీ సాయం

క‌రోనావైర‌స్ ప్ర‌పంచ దేశాల‌పై విరుచుకుపడింది. వేల సంఖ్య‌లో ప్రాణాల‌ను బలితీసుకుంటూ అల్ల‌క‌ల్లోలం క్రియేట్ చేస్తోంది. ప్ర‌స్తుతం అన్ని దేశాలు ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ కు వ్యాక్సిన్ గానీ, మెడిసిన్ గానీ క‌నుగునే ప‌నిలో బిజీగా ఉన్నాయి. ఈ క్ర‌మంలో ప‌లు దేశాలు ప‌రస్ప‌ర సాయం చేసుకుంటున్నాయి. మ‌రోవైపు భార‌త్ కూడా క‌రోనా వైర‌స్ చికిత్స‌లో కీల‌కంగా చెబుతోన్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మెడిసిన్ ను ఇప్ప‌టికే 55 దేశాల‌కు పంపించింది. ఇదే క్ర‌మంలో క‌ష్ట‌కాలంలో ఇండియా త‌న ఔన్న‌త్యాన్ని […]

ఇండియా గ్రేట్..క‌ష్ట‌స‌మ‌యంలో ఆ దేశానికి భారీ సాయం

Updated on: Apr 21, 2020 | 5:15 PM

క‌రోనావైర‌స్ ప్ర‌పంచ దేశాల‌పై విరుచుకుపడింది. వేల సంఖ్య‌లో ప్రాణాల‌ను బలితీసుకుంటూ అల్ల‌క‌ల్లోలం క్రియేట్ చేస్తోంది. ప్ర‌స్తుతం అన్ని దేశాలు ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ కు వ్యాక్సిన్ గానీ, మెడిసిన్ గానీ క‌నుగునే ప‌నిలో బిజీగా ఉన్నాయి. ఈ క్ర‌మంలో ప‌లు దేశాలు ప‌రస్ప‌ర సాయం చేసుకుంటున్నాయి. మ‌రోవైపు భార‌త్ కూడా క‌రోనా వైర‌స్ చికిత్స‌లో కీల‌కంగా చెబుతోన్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మెడిసిన్ ను ఇప్ప‌టికే 55 దేశాల‌కు పంపించింది. ఇదే క్ర‌మంలో క‌ష్ట‌కాలంలో ఇండియా త‌న ఔన్న‌త్యాన్ని మ‌రోసారి చాటుకుంది. క‌రోనా కార‌ణంగా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోన్న‌ క‌రీబీయ‌న్ దేశం ఆంటిగ్వాకు భారీ సాయాన్ని ప్ర‌క‌టించింది.

ఒక మిలియ‌న్ డాల‌ర్లు (సుమారు 7 కోట్ల 69 ల‌క్ష‌లు) విలువ చేసే ఆరోగ్య ఉత్ప‌త్తుల‌ సాయాన్ని ప్ర‌క‌టించిన‌ట్లు ఆంటిగ్వా జార్జ్‌టౌన్‌లోని భార‌త హైక‌మిష‌న్ కార్యాల‌యం అనౌన్స్ చేసింది. త‌క్ష‌ణ‌సాయంగా 150000 అమెరిక‌న్ డాల‌ర్ల వైద్య ప‌రిక‌రాల‌ను పంప‌నున్న‌ట్లు పేర్కొంది.