100 Million: ప‌ది కోట్లు దాటిన క‌రోనా బాధితుల సంఖ్య‌… ప్ర‌పంచ జ‌నాభాలో ఎంత శాతం మందికి క‌రోనా సోకిందంటే..?

| Edited By: Ravi Kiran

Jan 30, 2021 | 6:49 AM

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ సోకిన వారి సంఖ్య ప‌ది కోట్లు దాటింది. క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య 21 ల‌క్ష‌లు....

100 Million: ప‌ది కోట్లు దాటిన క‌రోనా బాధితుల సంఖ్య‌... ప్ర‌పంచ జ‌నాభాలో ఎంత శాతం మందికి క‌రోనా సోకిందంటే..?
Follow us on

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ సోకిన వారి సంఖ్య ప‌ది కోట్లు దాటింది. క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య 21 ల‌క్ష‌లు దాటిన‌ట్లు గ‌ణాంకాలు తెలుపుతున్నాయి. ప్ర‌తి 7.7 సెక‌న్ల‌కు ఓ వ్య‌క్తికి వైర‌స్ సంక్ర‌మిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌తి రోజు స‌గ‌టున 6,68,250 కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయి. ప్ర‌పంచ జ‌నాభాలో 1.3 శాతం మందికి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించిందని డ‌బ్ల్యూహెచ్ఓ లెక్క‌లు చెబుతున్నాయి.

మ‌ర‌ణాల రేటు ఎంతంటే..?

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ మ‌ర‌ణాల రేటు 2.15 శాతం ఉన్న‌ట్లు తేలింది. వైర‌స్ ప్ర‌భావానికి గురైన దేశాల్లో అమెరికా, ఇండియా, బ్రెజిల్‌, ర‌ష్యా, యూకే వ‌రుస స్థానాల్లో ఉన్నాయి. అయితే క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు 5 కోట్లు చేరేందుకు 11 నెల‌ల స‌మ‌యం ప‌ట్ట‌గా… మూడు నెల‌ల్లోనే పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది.