దంపతుల ప్రాణం తీసిన మద్యం.. నిప్పంటించుకున్న భార్య.. కాపాడే ప్రయత్నంలో భర్త.. తీవ్రగాయాలతో ఇద్దరు మృతి

భర్తతో గొడవపడి నిప్పుంటించుకున్న భార్యను కాపాడేందుకు ప్రయత్నించి.. దంపతులిద్దరూ అగ్నికి ఆహుతైయ్యారు.

దంపతుల ప్రాణం తీసిన మద్యం.. నిప్పంటించుకున్న భార్య.. కాపాడే ప్రయత్నంలో భర్త.. తీవ్రగాయాలతో ఇద్దరు మృతి

Updated on: Jan 15, 2021 | 9:14 AM

Couple died in Fire Accident : సంక్రాంతి పండుగపూట అలుమగల మధ్య ఘర్షణ ఆయువు తీసింది. భర్తతో గొడవపడి నిప్పుంటించుకున్న భార్యను కాపాడేందుకు ప్రయత్నించి.. దంపతులిద్దరూ అగ్నికి ఆహుతైయ్యారు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. దీంతో పండగ వేళ ఆ కుటుంబం తీవ్ర దు:ఖసాగరంలో మునిగిపోయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్కల్‌ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన చాకలి ఎల్లేశ్‌(42), సునీత(32)లు దంపతులు. గత కొంతకాలంగా ఎల్లేశ్‌ మద్యానికి బానిసవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు తలెత్తుతున్నాయి. ఇదే క్రమంలో బుధవారం రాత్రి ఎల్లేశ్ మద్యం తాగి ఇంటికి ఇచ్చాడు. దీంతో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదానికి దిగారు. భర్త వేధింపుల భరించలేక సునీత తన ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. దీంతో ఒక్కసారిగా హఠాత్తు పరిణామంతో భర్త ఎల్లేశ్‌ తన భార్యను కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎల్లేశ్‌కు కూడా మంటలు అంటుకోవడంతో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డాడు. తల్లిదండ్రులు ఇద్దరూ మంటల్లో కాలిపోవడం చూసిన వారి కుమార్తె హారిక కేకలు వేయడంతో ఇరుగుపొరుగు చేరుకుని వారిని కాపాడేందుకు ప్రయత్నించారు.

అప్పటికే తీవ్రంగా గాయపడ్డవారిని 108 సహాయంతో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో సునీత ప్రాణాలు కోల్పోగా, ఎల్లేశ్‌ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఎల్లేశ్ అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు.. కుటుంబసభ్యల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us