కరోనా విలయం.. ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల 34 వేల కేసులు.. 2 లక్షల 46 వేల మృతులు..

కోవిద్-19 మహమ్మారి వికృతరూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు

కరోనా విలయం.. ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల 34 వేల కేసులు.. 2 లక్షల 46 వేల మృతులు..

Edited By:

Updated on: May 03, 2020 | 11:16 PM

కోవిద్-19 మహమ్మారి వికృతరూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇక అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. కాగా, శాస్త్రవేత్తలు ఈ వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు విరుగుడును కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 3,534,297 కు చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 246,950 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,145,031 మంది కోలుకున్నారు.

భారత్ లో ఇప్పటి వరకు 37,776 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,223 మంది ప్రాణాలు కోల్పోగా, 10.018 మంది కోలుకున్నారు.

Also Read: గుడ్ న్యూస్: నెల రోజుల్లో కరోనా వ్యాక్సిన్.. భారత్ నుంచే..!