
దేశ వ్యాప్తంగా కరోని విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కట్టడి చర్యలు తీసుకున్నా కరోనా వైరస్ వ్యాప్తిని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో ఏకంగా 10, 956 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు వైరస్ బారిన పడి 396 మంది మరణించారు. దీనితో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,535కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 1,41,842 కాగా, 1,47,195 మంది మహమ్మారిని జయించి ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అటు వైరస్ కారణంగా 8498 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా బులిటెన్ విడుదల చేసింది.
?Total #COVID19 Cases in India (as on June 12, 2020)
▶️47.7% Active cases (141842)
▶️49.5% Cured/Discharged/Migrated (147195)
▶️2.8% Deaths (8498)Total COVID-19 confirmed cases = Active cases+Cured/Discharged/Migrated+Deaths
Via @MoHFW_INDIA pic.twitter.com/CRxJFtWpyz
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) June 12, 2020
మహారాష్ట్రలో లక్షకు చేరువవుతున్న కరోనా కేసులు…
మహారాష్ట్రలో కరోనా విలయం సృష్టిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 97,648 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3590 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. అటు ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌లలో కరోనా కోరలు చాస్తోంది. కాగా, ప్రపంచంలోనే కరోనాతో తీవ్రమైన ప్రభావితమైన దేశాలైన స్పెయిన్, యూకే దేశాలన్నీ భారత్ దాటేసింది. మన దేశంలో ఇప్పటివరకు 2,97,535 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో ప్రపంచంలో నాలుగో స్థానానికి భారత్ చేరుకుంది.