కలవరపెడుతున్న కరోనా.. చైనాలో చిక్కుకుపోయిన తెలుగు ఇంజనీర్లు!

| Edited By:

Jan 29, 2020 | 8:09 PM

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌తో ఇప్పుడు ప్రపంచమంతా వణుకుతోంది. ఇప్పటికే చైనాలో ఈ వ్యాధి 2744 మందికి సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. అటు 100 మంది చనిపోగా.. 461 మంది చావుబతుకుల మధ్య ఉన్నారు. ఇక వైరస్ తీవ్రత కారణంగా చైనా ఆర్ధిక శాఖ ఏకంగా 9 బిలియన్ డాలర్లను ప్రకటించి ఈ మహమ్మారిని తరిమి కొట్టడానికి సిద్ధమైంది. ఇదిలా ఉంటే చైనాలోని వుహాన్‌లో హుబి యూనివర్సిటీలో చిక్కుకున్న భారత విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నట్లు తెలుస్తోంది. […]

కలవరపెడుతున్న కరోనా.. చైనాలో చిక్కుకుపోయిన తెలుగు ఇంజనీర్లు!
Follow us on

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌తో ఇప్పుడు ప్రపంచమంతా వణుకుతోంది. ఇప్పటికే చైనాలో ఈ వ్యాధి 2744 మందికి సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. అటు 100 మంది చనిపోగా.. 461 మంది చావుబతుకుల మధ్య ఉన్నారు. ఇక వైరస్ తీవ్రత కారణంగా చైనా ఆర్ధిక శాఖ ఏకంగా 9 బిలియన్ డాలర్లను ప్రకటించి ఈ మహమ్మారిని తరిమి కొట్టడానికి సిద్ధమైంది.

ఇదిలా ఉంటే చైనాలోని వుహాన్‌లో హుబి యూనివర్సిటీలో చిక్కుకున్న భారత విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నట్లు తెలుస్తోంది. సరైన ఆహారం, నీళ్లు లేక అవస్థలు పడుతున్నారని సమాచారం. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల ద్వారా శ్రీ సిటీ టీసీఎల్ సంస్థకు ఎంపికైన మొత్తం 96 మంది ఇంజనీర్లు మూడు నెలల శిక్షణ కోసం వుహాన్ వెళ్ళారు. కిందటి సంవత్సరం ఆగస్టులో చైనా వెళ్ళిన ఈ ఇంజనీర్లలో 38 మంది నవంబరులోనే తిరిగి భారత్‌కు వచ్చారు.

మిగిలిన వారంతా వుహాన్‌లోనే ఉండిపోయారు. అందరినీ స్వస్థలాలకు చేరుద్దామని శ్రీసిటీ సంస్థ యత్నించింది. అయితే అప్పటికే.. కరోనా ప్రభావం నేపధ్యంలో నిషేధాజ్ఞలు అమల్లోకి రావడంతో సంస్థ యత్నాలు ఫలించలేదు. చైనాలోనే ఉండిపోవాల్సి వచ్చిన వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్: రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు ఉన్నారు.