తెలంగాణలోని ఆ ప్రాంతంలో కఠిన లాక్‌డౌన్… బయటికి వచ్చారో..!

|

Jul 24, 2020 | 1:25 PM

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయితీలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటిస్తున్న సంగతి తెలిసిందే.

తెలంగాణలోని ఆ ప్రాంతంలో కఠిన లాక్‌డౌన్... బయటికి వచ్చారో..!
Follow us on

Coronavirus Telangana: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయితీలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు గ్రామం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఆగష్టు 2వ తేదీ వరకు పూర్తిస్థాయి కఠినతరమైన లాక్‌డౌన్‌ను ప్రకటించింది ఆ గ్రామ పంచాయితీ.

కరోనా కట్టడిలో భాగంగా విధించిన ఈ లాక్ డౌన్‌ను ప్రజలందరూ పాటించాలని.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయితీ పెద్దలు హెచ్చరించారు. లాక్‌డౌన్ సమయంలో ఎవరైనా దుకాణాలు తెరిస్తే రూ. 20 వేలు భారీ జరిమానా.. అలాగే ప్రజలు రోడ్లపైకి వస్తే వంద రూపాయలు జరిమానా విధిస్తామన్నారు. కాగా,  కామారెడ్డిలో 509 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వైరస్ కారణంగా 11 మంది మరణించారు. ఇక జిల్లాలోని ప్రజాప్రతినిధులతో పాటు.. కోవిడ్ వారియర్స్‌గా విధులు నిర్వహిస్తున్న వారిని కూడా కరోనా వదలడం లేదు. ఇప్పటివరకు దాదాపు 35 మందికి పైగా పోలీసులు, పలువురు జర్నలిస్టులు, పది మందికి పైగా అధికారులు కరోనా బారినపడ్డారు.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి నెల రోజుల హోం క్వారంటైన్..

ఏపీలో కరోనా విజృంభణ.. ఆ జిల్లాలో 31 వరకు లాక్‌డౌన్‌..!