Corona Cases Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,901 పాజిటివ్ కేసులు, 67 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,57,587కి చేరింది. ఇందులో 95,733 యాక్టివ్ కేసులు ఉండగా.. 4,57,008 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో మృతుల సంఖ్య 4846కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. అటు గడిచిన 24 గంటల్లో 10,292 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1398 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 45,27,593 టెస్టులు నిర్వహించారు. జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 680, చిత్తూరులో 932, తూర్పు గోదావరిలో 1398, గుంటూరులో 479, కడపలో 792, కృష్ణాలో 467, కర్నూలులో 505, నెల్లూరులో 711, ప్రకాశంలో 1146, శ్రీకాకుళంలో 555, విశాఖలో 584, విజయనగరంలో 583, పశ్చిమ గోదావరిలో 1069 కేసులు నమోదయ్యాయి.
Also Read:
ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్ టికెట్స్ వచ్చేశాయి..
”ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ సప్లై.. 8 వేల జంబో జెట్‌లు అవసరం”