ఏపీలో కరోనా స్వైరవిహారం.. ఒక్క రోజే 10, 093 కేసులు, 65 మరణాలు

|

Jul 29, 2020 | 5:49 PM

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 70,584 శాంపిల్స్ టెస్టు చేయగా.. అందులో 10,093 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కరోనా స్వైరవిహారం.. ఒక్క రోజే 10, 093 కేసులు, 65 మరణాలు
Follow us on

Coronavirus Positive Cases In Andhra Pradesh: ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 70,584 శాంపిల్స్ టెస్టు చేయగా.. అందులో 10,093 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,20,390కి చేరింది. వీటిల్లో 63,771 యాక్టివ్ కేసులు ఉండగా.. 55,406 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1213కి చేరుకుంది.

అటు గడిచిన 24 గంటల్లో 2,784 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. 65 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. నిన్న ఒక్క రోజే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1676 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అనంతపురంలో 1371, గుంటూరులో 1124 కేసులు, కర్నూలులో 1091 కేసులు నమోదయ్యాయి. ఇక చిత్తూర్ 819, కడప 734, కృష్ణ 259, నెల్లూరు 608, ప్రకాశం 242, శ్రీకాకుళం 496, విజయనగరం 53, విశాఖపట్నం 841, పశ్చిమగోదావరి జిల్లాలో 779 కేసులు నమోదయ్యాయి. కాగా, తూర్పుగోదావరిలో అత్యధికంగా 17,739 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కర్నూలులో 179 కరోనా మరణాలు సంభవించాయి.

Also Read:

అరగంటలో పేషెంట్ అడ్మిట్ కావాలి.. సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..

ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ రెండు జిల్లాల్లో బ్యాంకుల వేళల్లో మార్పులు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా సమాచారానికి ప్రత్యేక వాట్సాప్ నెంబర్లు