Corona Positive Cases In Andhra Pradesh: ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,963 కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44,906కి చేరింది. వీటిల్లో 22,260 యాక్టివ్ కేసులు ఉండగా.. 21,763 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో 52 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 586కు చేరింది.
ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. అత్యధికంగా తూర్పు గోదావరిలో 994 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. గుంటూరులో 214, చిత్తూరు 343, కర్నూలు 550, అనంతపురం 220, శ్రీకాకుళం 182, నెల్లూరు 278, పశ్చిమ గోదావరి 407, విజయనగరం 118, కడప 145, ప్రకాశం 266, కృష్ణా 130, విశాఖపట్నంలో 116 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
#COVIDUpdates: 18/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 41,714 పాజిటివ్ కేసు లకు గాను
*19,223 మంది డిశ్చార్జ్ కాగా
*586 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 21,905#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/rb6RQCyWLJ— ArogyaAndhra (@ArogyaAndhra) July 18, 2020