
Coronavirus Positive Cases India: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో మళ్లీ అత్యధికంగా 89,706 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,115 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43,70,129కి చేరుకుంది. ఇందులో 8,97,394 యాక్టివ్ కేసులు ఉండగా.. 73,890 మంది కరోనాతో మరణించారు. అటు 33,98,884 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.
ఇదిలా ఉంటే అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ కేసులు ఎక్కువగా ఉండటం కాస్త ఊరటను ఇచ్చే అంశం అని చెప్పాలి. అంతేకాకుండా కోవిడ్‌తో మరణించిన వారిలో చాలామందికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధిక పాజిటివ్ కేసుల లిస్టులో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఢిల్లీ తప్పితే మిగిలిన అన్నింటిలోనూ రోజుకు 5 వేలుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ప్రస్తుతం రికవరీ రేట్ 77.77 శాతంలో ఉండగా.. డెత్ రేట్ 1.69 శాతం.. యాక్టివ్ కేసులు 20.53 శాతంగా ఉంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,54,549 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. నిన్న ఒక్క రోజే 79 వేల మంది రికవరీ అయ్యారు. కాగా, దేశంలో ఇప్పటివరకు 5,18,04,677 పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
Also Read:
ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన బస్సులు.. వివరాలివే..
విజయవాడ, విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలోనే సిటీ సర్వీసులు.!
జగన్ సర్కార్ సంచలనం.. నగదు బదిలీ పధకానికి శ్రీకారం..!
?#COVID19 India Tracker
(As on 9 September, 2020, 08:00 AM)➡️Confirmed cases: 43,70,128
➡️Recovered: 33,98,844 (77.8%)?
➡️Active cases: 8,97,394 (20.5%)
➡️Deaths: 73,890 (1.7%)#IndiaFightsCorona#IndiaWillWin#StaySafeVia @MoHFW_INDIA pic.twitter.com/zyV5aSylqA
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) September 9, 2020