ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే.!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,655 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,35,525కు చేరింది.

ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే.!

Updated on: Aug 10, 2020 | 7:29 PM

Coronavirus Positive Cases In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,655 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,35,525కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 80 మంది మరణించగా.. మృతుల సంఖ్య 2,116కు చేరింది. గడిచిన 24 గంటల్లో 6,924 మంది కరోనాను జయించగా.. కోలుకున్న వారి సంఖ్య 1,45,636కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 25,34,304 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 87,773 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 631, చిత్తూరులో 479, తూర్పు గోదావరిలో 1235, గుంటూరులో 621, కడపలో 439, కృష్ణాలో 146, కర్నూలులో 883, నెల్లూరులో 511, ప్రకాశంలో 450, శ్రీకాకుళంలో 354, విశాఖలో 620, విజయనగరంలో 574, పశ్చిమ గోదావరిలో 722 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2461, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 434 కేసులు నమోదయ్యాయి.

Follow Us