ఏపీలో తగ్గిన కరోనా.. ఏడు లక్షలు దాటిన రికవరీ కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 75,517 శాంపిల్స్‌ను పరీక్షించగా 5,210 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య

ఏపీలో తగ్గిన కరోనా.. ఏడు లక్షలు దాటిన రికవరీ కేసులు..

Updated on: Oct 11, 2020 | 7:47 PM

Coronavirus Positive Cases: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 75,517 శాంపిల్స్‌ను పరీక్షించగా 5,210 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,55,727కి చేరింది. ఇందులో 46,295 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,03,208 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 30 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,224కు చేరుకుంది. నేటి వరకు రాష్ట్రంలో 65.69 లక్షల కరోనా టెస్టులు జరిగాయి. ఇక నిన్న 5,509 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 311, చిత్తూరు 713, తూర్పుగోదావరి 701, గుంటూరు 431, కడప 418, కృష్ణా 462, కర్నూలు 175, నెల్లూరు 288, ప్రకాశం 362, శ్రీకాకుళం 212, విశాఖపట్నం 190, విజయనగరం 161, పశ్చిమ గోదావరి 786 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,043కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 705 మంది కరోనాతో మరణించారు.