కాకినాడలో కరోనా కలకలం.. స్థంభించిన కార్యకలాపాలు..

| Edited By:

Jul 17, 2020 | 4:46 PM

కాకినాడ నగరపాలక సంస్థ, జిల్లా కలెక్టర్ కార్యాలయం, పౌరసరఫరాలు, విద్యాశాఖ కార్యాలయాల్లో కరోనా కలకలం రేపుతోంది. కాకినాడ కార్పొరేషన్ ఆఫీసులో నలుగురు సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. నిన్న నిర్వహించిన ర్యాపిడ్ టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వచ్చే సోమవారం వరకు కార్యాలయానికి ఎవరు రావద్దని ఉన్నతాధికారులు సూచించారు. సిబ్బంది కార్యాలయం మెయిన్ గేట్ ను ముసివేసారు. అత్యవసర సిబ్బందిని మాత్రమే అనుమతిస్తున్నారు. సంయుక్త కలెక్టర్ రాజకుమారి పీఏ, మరో ఇద్దరికి కరోనా […]

కాకినాడలో కరోనా కలకలం.. స్థంభించిన కార్యకలాపాలు..
Follow us on

కాకినాడ నగరపాలక సంస్థ, జిల్లా కలెక్టర్ కార్యాలయం, పౌరసరఫరాలు, విద్యాశాఖ కార్యాలయాల్లో కరోనా కలకలం రేపుతోంది. కాకినాడ కార్పొరేషన్ ఆఫీసులో నలుగురు సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. నిన్న నిర్వహించిన ర్యాపిడ్ టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వచ్చే సోమవారం వరకు కార్యాలయానికి ఎవరు రావద్దని ఉన్నతాధికారులు సూచించారు. సిబ్బంది కార్యాలయం మెయిన్ గేట్ ను ముసివేసారు. అత్యవసర సిబ్బందిని మాత్రమే అనుమతిస్తున్నారు. సంయుక్త కలెక్టర్ రాజకుమారి పీఏ, మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. డిఈఓ కార్యాలయంలోనూ ఒకరికి కరోనా సోకింది. పోలీసు శాఖను కూడా వదల్లేదు. ఇద్దరు డిఎస్పీలు, సిఐలు, పలువురు కానిస్టేబుళ్ళకు కూడా కరోనా వైరస్ నిర్ధారణ అయింది. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో కార్యకలాపాలు స్థంభించాయి.

Also Read: యూజీసీ మార్గదర్శకాల మేరకు.. పరీక్షల నిర్వహణకే మొగ్గు..

Also Read: ఇక ప్రీ స్కూల్స్ గా అంగన్‌వాడీలు.. ఆన్‌లైన్‌లో బోధన..