కరోనా దెబ్బకు… స్టాక్ మార్కెట్ కుదేల్..!

| Edited By: Pardhasaradhi Peri

Jan 27, 2020 | 8:12 PM

చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి, ఇరాక్ లోని అమెరికా ఎంబసీపై రాకెట్లదాడి నేపథ్యంలో.. దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్‌ ఆరంభం నుంచే నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు అదే ధోరణిలో కొనసాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 458 పాయింట్లు నష్టపోయి 41,155 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 129 పాయింట్లు నష్టపోయి 12,119 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.48 వద్ద కొనసాగుతోంది. చైనాలోని కరోనా వైరస్‌ క్రమంగా ఇతర దేశాలకు […]

కరోనా దెబ్బకు... స్టాక్ మార్కెట్ కుదేల్..!
Follow us on

చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి, ఇరాక్ లోని అమెరికా ఎంబసీపై రాకెట్లదాడి నేపథ్యంలో.. దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్‌ ఆరంభం నుంచే నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు అదే ధోరణిలో కొనసాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 458 పాయింట్లు నష్టపోయి 41,155 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 129 పాయింట్లు నష్టపోయి 12,119 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.48 వద్ద కొనసాగుతోంది. చైనాలోని కరోనా వైరస్‌ క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తుండటం.. ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడి వంటి పరిణామాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.