దేశ వ్యాప్తంగా కరోనా టెస్టింగ్ సెంటర్లు ఇవే..

| Edited By:

Mar 12, 2020 | 4:22 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఇప్పటికే నాలుగు వేలమందికిపైగా ప్రాణాలను తీసుకోగా.. లక్ష మందికిపైగా దీని బారినపడి చికిత్స పొందుతున్నారు. అయితే గత నెల మనదేశంలో కూడా ఈ కరోనా ఎంటర్ అయ్యింది. దీంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అలర్టయ్యాయి. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. కరోనా వచ్చినట్లు అనుమానాలు కలిగితే.. వారిని వెంటనే పరీక్షిస్తున్నారు. ఇలా కరోనా అనుమానితులను పరీక్షించేందుకు దేశ వ్యాప్తంగా 52 కరోనా టెస్టింగ్ […]

దేశ వ్యాప్తంగా కరోనా టెస్టింగ్ సెంటర్లు ఇవే..
Follow us on

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఇప్పటికే నాలుగు వేలమందికిపైగా ప్రాణాలను తీసుకోగా.. లక్ష మందికిపైగా దీని బారినపడి చికిత్స పొందుతున్నారు. అయితే గత నెల మనదేశంలో కూడా ఈ కరోనా ఎంటర్ అయ్యింది. దీంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అలర్టయ్యాయి. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. కరోనా వచ్చినట్లు అనుమానాలు కలిగితే.. వారిని వెంటనే పరీక్షిస్తున్నారు. ఇలా కరోనా అనుమానితులను పరీక్షించేందుకు దేశ వ్యాప్తంగా 52 కరోనా టెస్టింగ్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కేంద్రాలు ఉన్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో ఒక టెస్టింగ్ సెంటర్..ఏపీలో మూడు టెస్టింగ్ సెంటర్లు ఉన్నాయి.

ఏపీలోని కరోనా టెస్టింగ్ సెంటర్ల వివరాలు

1. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతి
2. ఆంధ్ర మెడికల్ కాలేజ్, విశాఖపట్టణం
3. ప్రభుత్వ మెడికల్ కాలేజ్, అనంతపురం

తెలంగాణలో కరోనా సెంటర్ వివరాలు..
4. గాంధీ ఆస్పత్రి, సికింద్రాబాద్

బీహార్‌లో..
5. రాజేంద్ర మెమొరియల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, పాట్నా

అసోం..
6.గువాటీ మెడికల్ కాలేజ్, గువాహటీ
7.రీజినల్ మెడికల్ రీసర్చ్ సెంటర్, దిబ్రూగర్

అండమాన్ & నికోబార్
8. రీజినల్ మెడికల్ రీసర్చ్ సెంటర్, పోర్ట్ బ్లెయర్, అండమాన్ అండ్ నికోబార్..

చండీగర్..
9. పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ రీసర్చ్, చండీగర్

ఛత్తీస్‌గఢ్
10. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాయిపూర్, రాయిపూర్

ఢిల్లీ- ఎన్‌సీటీ
11. ఎయిమ్స్, ఢిల్లీ
12. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్, ఢిల్లీ

గుజరాత్
13. బీజే మెడికల్ కాలేజ్, అహ్మదాబాద్
14. ఎం.పీ షా ప్రభుత్వ మెడికల్ కాలేజ్, జామ్ నగర్

హర్యానా
15. పీటీ.బీడీ శర్మా పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, రోహతక్,
16. బీపీఎస్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్,సోనిపట్

హిమాచల్ ప్రదేశ్
17. ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్, షిమ్లా
18. డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్, కంగ్రా, టండా

జమ్ముకశ్మీర్..
19. షేర్ ఈ కశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, శ్రీనగర్
20. ప్రభుత్వ మెడికల్ కాలేజ్, జమ్మూ

జార్ఖండ్..
21. ఎంజీఎం మెడికల్ కాలేజ్, జంషెడ్‌పూర్

కర్నాటక…

22. బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బెంగళూరు
23. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఫీల్ట్ యూనిట్ బెంగళూరు
24. మైసూర్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మైసూర్
25. హసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, హసన్, కర్నాటక
26. శిమోగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, శివమొగ్గ, కర్నాటక

కేరళ
27. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఫీల్ట్ యూనిట్, కేరళ
28. ప్రభుత్వ మెడికల్ కాలేజ్, తిరుమనంతపురం
29. ప్రభుత్వ మెడికల్ కాలేజ్, కోజికోడ్

మధ్యప్రదేశ్..
30. ఎయిమ్స్, బోపాల్
31. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ట్రైబల్ హెల్త్, జబల్‌పూర్

మేఘాలయ
32. NEIGRI ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్స్, షిల్లాంగ్

మహారాష్ట్ర
33. ఇందిరా గాంధీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, నాగ్‌పూర్
34. కస్తూర్బా హాస్పిటల్ ఫర్ ఇన్ఫెక్టియస్ డిసిజెస్, ముంబై

మణిపూర్
35. జేఎస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఇంపాల్ ఈస్ట్, మనిపూర్

ఒడిషా
36. రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్, భువనేశ్వర్

పుదుచ్చెరి
37. జవహార్‌లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యూయేట్ మెడికల్ ఎడ్యూకేషన్ రీసెర్చ్, పుదుచ్చేరి

పంజాబ్
38. ప్రభుత్వ మెడికల్ కాలేజ్, పటియాల
39. ప్రభుత్వ మెడికల్ కాలేజ్, అమృత్‌సర్్

రాజస్థాన్
40. సవాయ్ మన్ సింగ్, జైపూర్
41. డాక్టర్.ఎస్?ఎన్ మెడికల్ కాలేజ్, జోద్‌పూర్
42. జవహర్ మెడికల్ కాలేజ్, జల్‌వార్, రాజస్థాన్
43. ఎస్‌పీ మెడికల్ కాలేజ్, బికనీర్, రాజస్థాన్

తమిళనాడు
44. కింగ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడికల్ అండ్ రీసెర్చ్, చెన్నై
45. ప్రభుత్వ మెడికల్ కాలేజ్, తేనీ

త్రిపుర
46. ప్రభుత్వ మెడికల్ కాలేజ్, అగర్తల

ఉత్తరప్రదేశ్
47. కింగ్స్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, లక్నో
48. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి
49. జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్, అలీఘర్

ఉత్తరాఖండ్
50. ప్రభుత్వ మెడికల్ కాలేజ్, హల్‌ద్వానీ

వెస్ట్ బెంగాల్
51. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోలేరా అండ్ ఎంటెరిక్ డిసీజెస్, కోల్‌కతా
52.IPGMER, కోల్‌కతా