ఏపీని వీడని కరోనా.. 14 వేలకు చేరువైన పాజిటివ్ కేసులు..

|

Jun 29, 2020 | 2:17 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా 793 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఏపీని వీడని కరోనా.. 14 వేలకు చేరువైన పాజిటివ్ కేసులు..
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా 793 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇందులో రాష్ట్రానికి చెందిన కేసులు 706 కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందినవి 87 ఉన్నాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 13,891కి చేరింది. ఇందులో 7,479 యాక్టివ్ కేసులు ఉండగా.. 6,232 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 180కి చేరింది.

మరోవైపు గడిచిన 24 గంటల్లో 30,216 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 706 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇక ఆదివారం 302 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. 11 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో అనంతపురం 96, చిత్తూరు 56, ఈస్ట్ గోదావరి 72, గుంటూరు 98, కడప 71, కృష్ణ 52, కర్నూలు  86, నెల్లూరు 24, ప్రకాశం 26, శ్రీకాకుళం 0, విశాఖపట్నం 11, విజయనగరం 1, వెస్ట్ గోదావరిలో 113 కేసులు నమోదయ్యాయి.

ఇది చదవండి: స్పెయిన్‌లోనే కరోనా తొలి కేసు..!