Coronavirus Cases India: దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 41,100 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 88,14,579కి చేరింది. చేరింది. వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 4,79,216 మంది చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 82,05,728 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న దేశవ్యాప్తంగా 447 మంది మృతి చెండంతో మొత్తం ఇప్పటివరకు వైరస్ కారణంగా 1,29,635 మంది ప్రాణాలు కోల్పోయారు. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పాజిటివ్ కేసుల కంటే రికవరీ రేటు అధికంగా ఉంటోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో సుమారు 93.09 శాతానికి రికవరీ రేటు చేరిందంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 5.44 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.47 శాతానికి తగ్గింది.
?#COVID19 India Tracker
(As on 15 November, 2020, 08:00 AM)➡️Confirmed cases: 88,14,579
➡️Recovered: 82,05,728 (93.09%)?
➡️Active cases: 4,79,216 (5.44%)
➡️Deaths: 1,29,635 (1.47%)#IndiaFightsCorona#Unite2FightCorona#StaySafe pic.twitter.com/lde7GbDglQ— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) November 15, 2020