కరోనా ఎఫెక్ట్.. ఏపీలోని ఆ జిల్లాలో 24 గంటల కర్ఫ్యూ..

|

Aug 02, 2020 | 12:03 AM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వీరవిహారం చేస్తోంది. టెస్టులు పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి, కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి.

కరోనా ఎఫెక్ట్.. ఏపీలోని ఆ జిల్లాలో 24 గంటల కర్ఫ్యూ..
Follow us on

Coronavirus Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వీరవిహారం చేస్తోంది. టెస్టులు పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి, కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. అనంతపురంలో గడిచిన 24 గంటల్లో 1128 కేసులు నమోదు కాగా.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 15,827 కేసులు నమోదయ్యాయి.

దీనితో అప్రమత్తమైన యంత్రాంగం.. కరోనాను కట్టడి చేసేందుకు 24 గంటల కర్ఫ్యూను విధించేందుకు సిద్దమయ్యారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు ఈ కర్ఫ్యూ ఉంటుందని.. అత్యవసర సేవలు మినహా మిగిలినవన్నీ కూడా మూసేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, అటు తూర్పుగోదావరిలోని అమలాపురం డివిజన్ వ్యాప్తంగా రేపు 24 గంటల కర్ఫ్యూ ను కొనసాగనుంది.

Also Read:

ఏపీలోకి వచ్చేవారికి గుడ్ న్యూస్.. ఆటోమేటిక్ ఈ-పాస్ జారీ..

ఏపీలో 396 హాట్ స్పాట్స్.. ఆ రెండు జిల్లాల్లోనే అత్యధికం..

కోనసీమలో కరోనా టెర్రర్.. ఆ ప్రాంతంలో కఠిన లాక్‌డౌన్..