కరోనా ఎఫెక్ట్: చైనాలో.. ఒకే రోజు 108 మంది మృతి!

| Edited By:

Feb 11, 2020 | 2:15 PM

కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో చైనా సహా ప్రపంచ దేశాలన్నీ వణుకుతున్నాయి. రోజు రోజుకీ విస్తరిస్తూ.. కరోనా విలయతాండవం చేస్తోంది. చైనాలో కరోనా వైరస్‌ ప్రభావానికి మరో 108 మంది ఒకే రోజు మృతి చెందారు. దీంతో.. మృతుల సంఖ్య 1016కి చేరింది. మరో 2,478 మందికి కొత్తగా కరోనా సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. మొత్తంగా ఇప్పటి వరకూ కరోనా సోకిన వారి సంఖ్య 42,638కి చేరింది. అయితే అందులో 4 వేల మందికి వ్యాధి నమై హాస్పిటల్ […]

కరోనా ఎఫెక్ట్: చైనాలో.. ఒకే రోజు 108 మంది మృతి!
Follow us on

కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో చైనా సహా ప్రపంచ దేశాలన్నీ వణుకుతున్నాయి. రోజు రోజుకీ విస్తరిస్తూ.. కరోనా విలయతాండవం చేస్తోంది. చైనాలో కరోనా వైరస్‌ ప్రభావానికి మరో 108 మంది ఒకే రోజు మృతి చెందారు. దీంతో.. మృతుల సంఖ్య 1016కి చేరింది. మరో 2,478 మందికి కొత్తగా కరోనా సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. మొత్తంగా ఇప్పటి వరకూ కరోనా సోకిన వారి సంఖ్య 42,638కి చేరింది. అయితే అందులో 4 వేల మందికి వ్యాధి నమై హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు.

కాగా.. చైనాలో కరోనా వైరస్ విజృంభనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చైనా తీసుకుంటున్న చర్యలపై ప్రశంసలు కురిపించారు. అయితే ఈ వ్యాధి ఏప్రిల్‌లో తగ్గుముఖం పడుతుందన్నారు.