
India Reports Highest Daily Spike Of Positive Cases: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతీ రోజూ పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 49,310 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 740 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,87,945కి చేరుకుంది. ఇందులో 4,40,135 యాక్టివ్ కేసులు ఉండగా.. 30,601 మంది కరోనాతో మరణించారు. అటు 8,17,209 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో 29,000 మంది కరోనా నుంచి కోలుకున్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్నా.. అదే సమయంలో రికవరీల శాతం కూడా పెరుగుతుండటం కాస్త ఊరటను ఇస్తోంది.
ఇక అత్యధిక పాజిటివ్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో 3,47,502 పాజిటివ్ కేసులు నమోదు కాగా 12,854 మంది కరోనాతో చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో 1,27,364 కేసులు, 3,745 మరణాలు సంభవించాయి. ఇక తమిళనాడులో అయితే.. 1,92,964 కేసులు నమోదు కాగా, 3,232 మంది మృత్యువాతపడ్డారు. కోవిడ్ మరణాలు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లలో సంభవించాయి.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి నెల రోజుల హోం క్వారంటైన్..