
Corona Test Only If Aadhar: హైదరాబాద్‌లో పలు చోట్ల ఆధార్ కార్డు లేకుంటే కరోనా టెస్టులకు నమూనాలు సేకరించేందుకు వైద్య సిబ్బంది నిరాకరిస్తున్నారు. తల్లిదండ్రులతో కలిసి కరోనా టెస్టుల కోసం కోవిడ్ నిర్ధారణ కేంద్రాలకు వెళ్తున్న చిన్నారులకు ఆధార్ కార్డు లేకపోవడంతో వారికి పరీక్షలు నిర్వహించలేమని వైద్య సిబ్బంది చెబుతున్నారు.
ఇలాంటి తరహ ఘటన ఒకటి తాజాగా రాజేంద్రనగర్‌లో జరిగింది. దీనితో వైద్య సిబ్బంది తీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఆధార్ కార్డులో ఉన్న చిరునామానే వైద్య సిబ్బంది నమోదు చేస్తుండటంతో హోం ఐసోలేషన్ కిట్లు అందించడంలో సమన్వయం కొరవడుతోంది.
Also Read: దేశంలో డిసెంబర్ వరకు స్కూళ్ళు మూసివేత.. నిజమేనా.?