గాలి ద్వారా క‌రోనా వ్యాప్తి నిజ‌మే…ఉస్మానియా ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు

|

Jul 08, 2020 | 4:49 PM

గాలిలో కూడా కరోనా వైర‌స్ కణాలు బ్ర‌తికే ఉంటాయ‌ని టీవీ9 తో ఉస్మానియా ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు తెలిపారు. తుమ్మితే, దగ్గితేనే కాదు, గాలి పీల్చడం ద్వారా కూడా కరోన వ్యాప్తి చెందే అవ‌కాశం ఉన్న‌ట్లు వెల్లడించారు.

గాలి ద్వారా క‌రోనా వ్యాప్తి నిజ‌మే...ఉస్మానియా ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు
Follow us on

గాలిలో కూడా కరోనా వైర‌స్ కణాలు బ్ర‌తికే ఉంటాయ‌ని టీవీ9 తో ఉస్మానియా ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు తెలిపారు. తుమ్మితే, దగ్గితేనే కాదు, గాలి పీల్చడం ద్వారా కూడా కరోన వ్యాప్తి చెందే అవ‌కాశం ఉన్న‌ట్లు వెల్లడించారు. పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కరోనా వైరస్ గాలిలో ఎక్కువసేపు బ్ర‌తికి ఉంటుంద‌ని వివ‌రించారు. అందుకే మెట్రో న‌గ‌రాల్లో వైర‌స్ వ్యాప్తి వేగంగా ఉన్న‌ట్లు తెలిపారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇళ్లలో, అపార్ట్ మెంట్స్ లో.. ఐసోలేషన్ లో ఉండటం అనేది కూడా ప్రమాద‌క‌ర‌మ‌ని అభిప్రాయ‌డప‌డ్డారు. వైర‌స్  సోకకుండా ప్ర‌జ‌లు..క్వాలిటీ ఉన్న మాస్కుల‌ను, శానిటైజ‌ర్ల‌ను వాడాల‌ని సూచించారు.