మహారాష్ట్రలో స్ట్రెయిన్ కలకలం.. బ్రిటన్‌ నుంచి వచ్చిన యువకుడిలో ఆ లక్షణాలు..! నిర్ధారించిన వైద్యులు

కరోనా పేరు చెబితేనే జనం వణికిపోతున్నారు. యూకేలో కరోనా కొత్త రూపం సంతరించుకున్నది అని తెలిసినప్పటి నుంచి ఆ దేశం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. అయినా అప్పటికే భారత్‌లో కొందరు యూకే, బ్రిటన్‌ నుంచి కొందరు వచ్చేశారు.

మహారాష్ట్రలో స్ట్రెయిన్ కలకలం.. బ్రిటన్‌ నుంచి వచ్చిన యువకుడిలో ఆ లక్షణాలు..! నిర్ధారించిన వైద్యులు
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 24, 2020 | 8:01 PM

కరోనా పేరు చెబితేనే జనం వణికిపోతున్నారు. యూకేలో కరోనా కొత్త రూపం సంతరించుకున్నది అని తెలిసినప్పటి నుంచి ఆ దేశం నుంచి రాకపోకలు నిలిపివేసిది భారత్. అయినా అప్పటికే భారత్‌లో కొందరు యూకే, బ్రిటన్‌ నుంచి కొందరు వచ్చేశారు. అలా బ్రిటన్‌ నుంచి నాగపూర్ వచ్చిన ఓ‌ వ్యక్తిలో కొత్త రకం కరోనా.. స్ట్రెయిన్ సోకి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన ఓ యువకుడు నవంబర్‌ 29న బ్రిటన్‌ నుంచి భారత్‌కు వచ్చాడు. ఎయిర్‌పోర్టులో కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్‌గా రిపోర్టు వచ్చింది. అయితే వారం రోజుల తర్వాత ఆయనలో కరోనా లక్షణాలు కనిపించాయి. వాసనను గుర్తించలేకపోవడంతో ఈ నెల 15న మరోసారి కోవిడ్   పరీక్షలు నిర్వహించారు. వారికి జరిపిన పరీక్షల్లో ఆయనతోపాటు కుటుంబ సభ్యులకు కూడా పాజిటివ్‌ అని తేలింది.

దీంతో ఈ నెల 22న ఆ యువకుడిని నాగపూర్‌ ప్రభుత్వ వైద్య కాలేజీ ఆసుపత్రిలో చేర్పించారు. అతడి నుంచి రెండు నమూనాలను సేకరించారు. ఒకదానికి ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించి మరో నమూనాను పూణే ల్యాబ్‌కు పంపారు. బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్‌ అతడికి సోకి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. పూణే ల్యాబ్‌కు పంపిన నమూనా రిపోర్ట్‌ వస్తే కాని నిర్ధారించలేమంని అంటున్నారు.