కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్

|

Sep 16, 2020 | 10:13 PM

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. తాను హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు వెల్లడించారు. తనకు నిన్న నీరసంగా అనిపించడంతో వైద్యుడిని సంప్రదించానని..

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్
Follow us on

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. తాను హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు వెల్లడించారు. తనకు నిన్న నీరసంగా అనిపించడంతో వైద్యుడిని సంప్రదించానని.. అదే క్రమంలో కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని ఆయన తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని అన్నారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పటికే అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, శ్రీపాద్ నాయక్ సహా పలువు కేంద్ర మంత్రులు ఈ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.