ఏపీ తగ్గని కరోనా జోరు.. కొత్తగా ఎన్ని కేసులంటే..!

|

Sep 10, 2020 | 5:48 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,175 పాజిటివ్ కేసులు, 68 మరణాలు సంభవించాయి.

ఏపీ తగ్గని కరోనా జోరు.. కొత్తగా ఎన్ని కేసులంటే..!
Follow us on

Corona Cases Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,175 పాజిటివ్ కేసులు, 68 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,37,687కి చేరింది. ఇందులో 97,338 యాక్టివ్ కేసులు ఉండగా.. 4,35,647 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో మృతుల సంఖ్య 4702కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. అటు గడిచిన 24 గంటల్లో 10,040 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 43,80,991 టెస్టులు నిర్వహించారు. జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 422, చిత్తూరులో 968, తూర్పు గోదావరిలో 1412, గుంటూరులో 838, కడపలో 576, కృష్ణాలో 545, కర్నూలులో 482, నెల్లూరులో 823, ప్రకాశంలో 1386, శ్రీకాకుళంలో 664, విశాఖలో 404, విజయనగరంలో 516, పశ్చిమ గోదావరిలో 1139 కేసులు నమోదయ్యాయి.

Also Read: 

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 11న ఖాతాల్లోకి నగదు జమ.!

బ్యాంక్ కస్టమర్లకు షాక్.. సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్..

ఇంటర్ అకడమిక్ క్యాలెండర్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..