రాజ్యసభ సభ్యుల్లో కరోనా భయం.. 60 ఏళ్ళకు పైగా ఉండడమే కారణమా..?

|

Sep 05, 2020 | 2:47 PM

కరోనా ప్రభావం పార్లమెంట్‌పై పడింది. దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో పార్లమెంట్ సమావేశాలు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. సభ్యుల ఆరోగ్య స్థితిగతులపై వారి కుటుంబ సభ్యుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. అధికంగా ఎక్కువ వయసు కలిగిన వారు కావడమే ఇందుకు కారణమంగా భావిస్తున్నారు.

రాజ్యసభ సభ్యుల్లో కరోనా భయం.. 60 ఏళ్ళకు పైగా ఉండడమే కారణమా..?
Follow us on

కరోనా ప్రభావం పార్లమెంట్‌పై పడింది. దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో పార్లమెంట్ సమావేశాలు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. మరోవైపు కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ఈనెల 14నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సభ్యుల ఆరోగ్య స్థితిగతులపై వారి కుటుంబ సభ్యుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. అధికంగా ఎక్కువ వయసు కలిగిన వారు కావడమే ఇందుకు కారణమంగా భావిస్తున్నారు.

ముఖ్యంగా వృద్ధులు అధికంగా ఉన్న రాజ్యసభ సభ్యుల పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న 244 మంది సభ్యుల్లో 130 మంది 60 ఏళ్ల పైబడిన వారే కావడం విశేషం. ఇందులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ (87) అందరికంటే పెద్దవారు. తర్వాతి స్థానంలో అకాళీదళ్‌ ఎంపీ సుఖ్‌దేవ్‌సింగ్‌ ధిండ్సా (84), టీఆర్ఎస్ నేత కె.కేశవరావు (81), ఏఐఏడీఎంకె సభ్యుడు ఎస్‌.ఆర్‌.బాలసుబ్రహ్మణ్యన్‌ (81) ఉన్నారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ ఉభయ సభాపతులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు, కొవిడ్‌ నేపథ్యంలో పార్లమెంట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భౌతిక దూరం ఉండేలా సీట్లను సర్దుబాటు చేస్తున్నారు. రాజ్యసభ సమావేశాలకు రెండు ఛాంబర్లతో పాటు, గ్యాలరీని కూడా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. 60 మంది ఎంపీలు ఛాంబర్లో, 51 మంది గ్యాలరీల్లో, మిగిలిన 132 మంది లోక్‌సభ హాల్లో కూర్చునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు లోక్‌సభలోనూ ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు అనుసరించాల్సి వ్యుహంపై స్పీకర్ పార్లమెంట్ అధికారులు సూచనలు చేశారు.