కర్నాటకలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. కేవలం ఒక్క రోజే 141 మంది కరోనా కారణంగా మరణించారు. ఈ సంఖ్యను చూస్తే రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటితో కలుకుని రాష్ట్రవ్యాప్తంగా సంభవించిన మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,232కు చేరుకుంది. గురువారం సాయంత్రం ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన కొరోనా బులెటిన్ లో పేర్కొంది. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినవారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. కేవలం 24 గంటల్లో 9,386 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,09,792కు చేరుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ పేర్కొంది.
తాజాగా కేసుల్లో 3,357 కేసులు ఒక్క బెంగళూరులోనే నమోదయ్యాయి. ఫలితంగా నగరంలో వెలుగుచూసిన మొత్తం కేసుల సంఖ్య 1,18,728కు చేరుకోగా, 35,989 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక, ఇప్పటి వరకు మొత్తంగా 2,19,554 మంది కోలుకోగా, 84,987 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 747 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.