5 రాష్ట్రాల్లో పెరిగిన కరోనా కేసులు.. కేంద్రం

నెల రోజుల కాలంలో కేరళ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మణిపూర్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పెరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. అక్టోబరు 3 నుంచి నవంబరు 3 వరకు తేలిన లెక్క ఇదన్నారు. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, యూపీ రాష్ట్రాల్లో ఇవి తగ్గుముఖం పట్టినట్టు ఆయన చెప్పారు. గత 7 వారాల్లో రోజువారీ కేసులు, కరోనా మరణాలు చాలావరకు  సగటున తగ్గాయన్నారు. సెప్టెంబరు 16-22 మధ్య కొత్త కేసులు 90,346 […]

5 రాష్ట్రాల్లో పెరిగిన కరోనా కేసులు.. కేంద్రం

Edited By:

Updated on: Nov 04, 2020 | 6:46 PM

నెల రోజుల కాలంలో కేరళ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మణిపూర్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పెరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. అక్టోబరు 3 నుంచి నవంబరు 3 వరకు తేలిన లెక్క ఇదన్నారు. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, యూపీ రాష్ట్రాల్లో ఇవి తగ్గుముఖం పట్టినట్టు ఆయన చెప్పారు. గత 7 వారాల్లో రోజువారీ కేసులు, కరోనా మరణాలు చాలావరకు  సగటున తగ్గాయన్నారు. సెప్టెంబరు 16-22 మధ్య కొత్త కేసులు 90,346 నమోదు కాగా, అక్టోబరు 28-నవంబరు 3 మధ్య ఇవి 40,884 కి తగ్గినట్టు రాజేష్ భూషణ్ వివరించారు. దేశంలో ఇప్పటివరకు 11 కోట్లకు పైగా టెస్టులు నిర్వహించినట్టు ఆయన పేర్కొన్నారు.

 

 

Follow Us